రామయ్యా వస్తావయ్యా ముందే రానుందా?

రామయ్యా వస్తావయ్యా ముందే రానుందా?

Published on Jun 27, 2013 7:50 PM IST

Ramaiya-Vastavaiya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా అనుకున్న తేదీ కంటే కాస్త ముందే రానుందా? అంటే అవుననే చెప్పాలి. ఈ మూవీని ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సినిమాని పది రోజుల ముందే అనగా సెప్టెంబర్ 17న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రొడక్షన్ టీం నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది అలాగే చాలా వేగంగా షూటింగ్ జరుగుతోంది.

ఇప్పటికే ఈ మూవీపై ఫుల్ క్రేజ్ ఉంది, ఈ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ మాస్ డైలాగ్స్ కి మంచి పేరుంది, ఆయన రాసే పవర్ఫుల్ డైలాగ్స్ ని ఎన్.టి.ఆర్ చెబితే ఇంకా ఓ రేంజ్ లో ఉంటాయి. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సమంత, శృతి హాసన్ హరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు