గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఉందన్న యువ హీరో

గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఉందన్న యువ హీరో

Published on Mar 2, 2013 2:20 PM IST

ram

సినీ తారలు తమ కెరీర్ గురించి కాకుండా వాళ్ళ వాళ్ళ జీవిత లక్ష్యాల గురించి మాట్లాడటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ కొంత మంది సెలబ్రిటీలు మంచి పనుల కోసం ప్రజల మద్దతు కోరుతూ క్యాంపైన్లు నిర్వాహిస్తూ ఉంటారు. నాగార్జున, అమల తరుచూ నేత్ర దానం, అవయవ దానం గురించి చెప్తూ ఉంటారు. శేఖర్ కమ్ముల మహిళలపై జరిగే దురాగతాల గురించి తెలుపడానికి ‘ఐ కేర్’ క్యాంపైన్ స్థాపించాడు.

ఇప్పుడు యువ హీరో రామ్ తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం అని తెలిపాడు. “నాకు జీవితంలో రెండే లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి నటుడు అవ్వాలని, ఇంకొకటి ఒక పేద గ్రామాన్ని దత్తత తీసుకోవాలని..మొదటిది 15ఏళ్ళకు నెరవేరింది. తరువాతది ఎప్పుడో… ” అని ట్వీట్ చేసాడు. అతని కల తొందర్లోనే నెరవేరాలని కోరుకుందాం. రామ్ తొందర్లోనే ‘బోల్ బచ్చన్’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడు. విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాని కే. విజయభాస్కర్ తెరకేక్కిస్తుండగా, స్రవంతి రవికిషోర్ – సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు