‘హీరో రామ్’కి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చాడు. తనకు మంచి హిట్ మూవీ ఇచ్చిన పూరి కోసం రామ్ వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న ‘రొమాంటిక్’ సినిమా కోసం రామ్ వాయిస్ ఓవర్ చెప్పాడు. లవ్ స్టోరీ గురించి చెప్పే కంటెంట్ ను రామ్ చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ వాయిస్ ఫుల్ ఎనర్జీ.. అలాంటి రామ్ వాయిస్ తో రొమాంటిక్ మొదలు కాబోతుందంటే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు రామ్.
ఇక రొమాంటిక్ మూవీ విషయానికి వస్తే.. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పూరి నిర్మిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరి హిట్ కొడతాడేమో చూడాలి. అన్నట్టు ఛార్మి కూడా పూరి జగన్నాథ్ తో కలిసి పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.