ఒంగోలు గిత్త డబ్బింగ్ స్టార్టయ్యింది


రామ్, కృతి ఖర్భంద జంటగా నటిస్తున్న ఒంగోలు గిత్త టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమాకి సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోలో ఈరోజే ప్రారంభమయ్యాయి. ఆడియో త్వరలో విడుదల చేసి క్రిస్మస్ సెలవుల్లో సినిమాని విడుదల చేయనున్నారు. బొమ్మరిల్లుతో దర్శకుడిగా పరిచయమైన భాస్కర్ కి ఇది నాలుగవ సినిమా. ఆరంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలవడంతో చాలా కాలం గ్యాప్ తీసుకుని ఒంగోలు గిత్త చేస్తున్నాడు. ఎందుకంటే ప్రేమంట పరాజయం పాలవడంతో రామ్ కి కూడా ఈ సినిమా కీలకం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version