దుమ్ము లేపనున్న రామ్.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం మరో క్రేజీ స్టెప్!

దుమ్ము లేపనున్న రామ్.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం మరో క్రేజీ స్టెప్!

Published on Nov 22, 2025 3:04 PM IST

Andhra King Taluka

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా”. రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా రామ్ కెరీర్ లో అంతకంతకు స్పెషల్ గా మారుతూ వస్తుంది అని చెప్పాలి.

మరి ఈ సినిమా కోసం రామ్ మొట్ట మొదటిసారిగా పాటల రచయితగా కూడా మారగా ఇప్పుడు మరో క్రేజీ స్టెప్ ని ఈ సినిమా కోసం స్పెషల్ గా తీసుకున్నాడు. మేకర్స్ ఈ సినిమా నుంచి ఐదో సాంగ్ ని ఇవాళ విశాఖపట్నం, ఆర్కే బీచ్ దగ్గర లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ లాంచ్ లో రామ్ ఆ సాంగ్ ని స్పెషల్ పెర్ఫామెన్స్ తో దుమ్ము లేపనున్నాడట.

దీనితో మొదటిసారి మరో ఇంట్రెస్టింగ్ స్టెప్ ని తాను తీసుకున్నాడని మేకర్స్ చెబుతున్నారు. ఇది వరకు ఈ రేంజ్ ప్రమోషన్స్ అయితే రామ్ ఏ సినిమాకి కూడా చేయలేదు. మరి ఈ సినిమా తనకి ఎంత స్పెషల్ అనేది దీనితో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ నవంబర్ 27న తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు