టాలివుడ్ యువహీరో రామ్ మరిన్ని యాక్షన్ చిత్రాలలో నటించాలని అనుకుంటున్నారు ఇప్పటి వరకు అయన చేసిన “దేవదాసు”,“రెడీ” గత ఏడాది “కందిరీగ” అన్ని చిత్రాలు రొమాంటిక్ ఎంటర్టైనర్లే ఈ చిత్రంలో కొద్ది పాళ్ళు మాత్రమే యాక్షన్ అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం భాస్కర్ దర్శకత్వంలో “ఒంగోల్ గిత్త” చిత్రంలో నటిస్తున్నారు త్వరలో సంతోష్ శివన్ దర్శకత్వంలో చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. “ఒంగోల్ గిత్త” చిత్రం తరువాత యాక్షన్ ఎంటర్టైనర్లు చెయ్యాలని ఉందని వెనువెంటనే రెండు చిత్రాలు చేయ్యనున్నట్లు వాటి గురించి మరింత సమాచారం త్వరలో అందిస్తాను అని రామ్ చెప్పారు. ఇదిలా ఉండగా “ఒంగోల్ గిత్త” ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ సరసన కృతి కర్భంద నటిస్తున్నారు. BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.