క్రిస్ మస్ కానుకగా రామ్ ఒంగోలుగిత్త?

క్రిస్ మస్ కానుకగా రామ్ ఒంగోలుగిత్త?

Published on Nov 30, 2012 1:30 AM IST


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఒంగోలు గిత్త’. ఈ సినిమాని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమా ఆడియోని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో రామ్ సరసన కృతి కర్బంద హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తునాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ క్లాస్ చిత్రాలను తీసిన భాస్కర్ మాస్ ఎంటర్టైనింగ్ మూవీని ఎలా తీస్తారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాజా వార్తలు