“మర్డర్” విషయంలో కోర్టుకు థాంక్స్ చెబుతున్న వర్మ.!

“మర్డర్” విషయంలో కోర్టుకు థాంక్స్ చెబుతున్న వర్మ.!

Published on Nov 6, 2020 12:06 PM IST

ఒకప్పుడు కొత్తదానినికి సృజనాత్మకతకు అద్దం పట్టి సరికొత్త సినిమాలను ఇండియన్ సినిమాకు అందించిన సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఊహించని పేలవమైన సినిమాలు తీస్తూ దెబ్బ తింటున్నాడు. తాను దర్శకత్వం చేసింది అయినా దర్శకత్వ పర్యవేక్షణ చేసింది అయినా మొదట హైప్ బానే వస్తుంది కానీ ఓవరాల్ గా మాత్రం ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి.

అయినా సరే వర్మ అండ్ టీం వారి ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. పైగా ఈ మధ్య కాలంలో జరిగిన సున్నిత సంచలన విషయాలను పట్టుకొని సినిమాలు చెయ్యడం మొదలు పెట్టాడు. అలా చేసిన సినిమానే “మర్డర్”. ఈ సినిమాను ఎవరి జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారో తెలిసిందే.

దీనితో అక్కడ నుంచి సంచలనం రేపిన వర్మ ఈ సినిమా వివాదం కోర్టు వరకు వెళ్ళింది. కానీ ఫైనల్ గా మాత్రం కోర్టుకు వర్మ థాంక్స్ చెబుతున్నాడు. తాము చెప్పాలి అనుకున్న “మర్డర్” ప్రయత్నాన్ని అర్ధం చేసుకున్న గౌరవనీయ కోర్టు వారి నిర్ణయంతో సంతోషంగా ఉన్నానని ఇతర వివరాలు తర్వాత వెల్లడి చేస్తానని వర్మ తెలిపారు. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు