బాలీవుడ్లో రామ్ చరణ్ మొదటి చిత్రం “జంజీర్” చిత్రాన్ని 2013 ఏప్రిల్ 12న విడుదల చెయ్యనున్నారు. 1973లో వచ్చిన అమితాబ్ బచ్చన్ చిత్రం “జంజీర్” కి ఈ చిత్రం రీమేక్. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. గతంలో “డాన్” మరియు “అగ్నీపత్” వంటి రీమేక్లలో కూడా ప్రియాంక కథానాయికగా నటించారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, అడై మెహ్ర ప్రొడక్షన్స్ మరియు ఫ్లయింగ్ టర్టుల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం మూడు షెడ్యూల్ల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సంజయ్ దత్ ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, మహి గిల్, శ్రీహరి మరియు సోను సూద్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అపూర్వ లఖియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు పుకారు