రామ్ చరణ్ తాజా చిత్రం ‘తూఫాన్’, హిందీ లో ‘జంజీర్’ ని ఈ వేసవి లో విడుదల చెయ్యడానికి రంగం సిద్ధమైంది . కొన్ని రోజుల నుంచి ఈ చిత్రం విడుదల సుప్రీమ్ కోర్ట్ సంజయ్ దత్ ని ఆయుధాలు 1993 అక్రమంగా కలిగివుండడానికి విదించిన శిక్షవల్ల ఆలస్యం అవుతుందని పూకర్లు వచ్చాయి. చాలా మంది సంజయ్ దత్ వాళ్ళ సినిమా పెద్ద ప్రమాదంలో పడతుంది అని అన్నారు. కాకపోతే దర్శకుడు అపూర్వ లిఖియా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తానూ లొంగిపొయేముందు తన ప్రాజెక్ట్లు అన్ని పూర్తి చేస్తాను అని సంజయ్ దత్ మాటిచ్చినట్టుగానే గత కొన్ని రోజులుగా ఎడతెరపి షూటింగ్లో పాల్గొంటున్నాడు . “సెట్లో సంజయ్ ఒక రాజులా షూటింగ్లో పాల్గొంటున్నాడు. బిన్నత్వంలో పోరాటపటిమను మరోసారి నిరూపించాడని” దర్శకుడు ట్వీట్ చేసాడు.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ ముఖ్య నటులు. తెలుగులో సంజయ్ పాత్రని శ్రీ హరి పోషించాడు. తెలుగు వెర్షన్ పేరు ‘తూఫాన్’ అని తెలిసినదే. అయితే ఈ సినిమాని తెలుగు మరియు హిందీలలో ఒకేసారి విడుదల చెయ్యాలన్న ఆలోచనతో నోరాత ఇంకా విడుదల తేదిని ఖరారు చెయ్యలేదు.