మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎవడు’. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత మరియు అమీ జాక్సన్ ఆడి పాడుతున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో రామ్ చరణ్ లుక్ మరియు పాత్ర చాలా కొత్తగా ఉండనుంది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక అతిధి పాత్రలో కనిపించనున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘నాయక్’ మరియు హిందీలో రిమేక్ అవుతున్న ‘జంజీర్’ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు.