అమీ జాక్సన్ తెలుగు వారికి పెద్దగా పరిచయం లేకపోయినా తమిళ సినిమాల వల్ల కొంతమందికి తెలుసు. ఈ అందాల భామ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో నటిస్తోంది. సహజంగా జంతువులని అమితంగా ఇష్టపడే అమీ జాక్సన్ ఏదైనా ఒక జంతువుని దత్తత తీసుకొని పెంచుకోవాలని డిసైడ్ అయ్యింది కానీ అందరిలా కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని కాకుండా కొంచెం కొత్తగా ఉండాలని ఒక డాల్ఫిన్ ని తీసుకుంది. ఒక న్యూస్ పేపర్ తో మాట్లాడుతూ ‘ నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి మెక్సికో వెళ్ళినప్పుడు డాల్ఫిన్స్ తో ప్రేమలో పడ్డాను. చెప్పాలంటే సముద్రంలో వాటితో పాటు నేనూ ఈదగలను. అందుకే నా బర్త్ డే సందర్భంగా స్మూతీ అనే డాల్ఫిన్ ని దత్తత తీసుకున్నానని’ తెలిపింది.
స్వతహాగా ఇంగ్లాండ్ కి చెందిన ఈ భామ యుకె లో డాల్ఫిన్స్ ని రక్షించే డబ్ల్యూడబ్ల్యూఈ సంస్థ నుండి కొనుక్కుంది. అమీ జాక్సన్ ఎక్కువ భాగం ముంబై – కాశ్మీర్ లో గడుపుతూ ఎక్కువగా ట్రావెల్ చేస్తోంది. ఏప్రిల్లో ఓ పాట చిత్రీకరణ కోసం ఎవడు టీంతో కలవనున్న అమీ జాక్సన్ అది పూర్తయిన తర్వాత విక్రం హీరోగా నటిస్తున్న ద్వి బాషా చిత్రం ‘మనోహరుడు’ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది.