ఒకే సంవత్సరంలో రామ్ చరణ్ 3 సినిమాలు.!

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. అందులో ఒకటి వి.వి వినాయక్ డైరెక్షన్లో కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘నాయక్’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని జనవరి 9న విడుదల చేయనున్నారు. ఇక రెండవ సినిమా విషయానికి వస్తే వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రానున్న ‘ఎవడు’. శ్రుతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని 2013 దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక చివరిగా సెట్ పై ఉన్న సినిమా ‘జంజీర్’. ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అపూర్వ లిఖియా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా 2013 ఏప్రిల్ 12న విడుదల కానుందని ఈ రోజు తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే రామ్ చరణ్ ఒకే సంవత్సరంలో 3 సినిమాలను రిలీజ్ చేసి అభిమానులను ఖుషీ చేయనున్నాడు.

Exit mobile version