
కొత్త జంట రామ్ చరణ్, ఉపాసన పెళ్లి తరువాత మొదటి వినాయక చవితి పండుగని వైజాగ్లో చేసుకున్నారు. వైజాగ్లోని ఆశీలుమెట్ట వద్ద ఉన్న ప్రముఖ వినాయక మండపంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసారు. ఉదయం ఏడు గంటలకే అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఆ తరువాత రామ్ చరణ్ దంపతులు గాజువాక సెంటర్లోని గుడి దగ్గరికి చేరుకొని 45 అడుగుల వినాయకుడికి దర్శించుకున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎవడు చిత్ర షూటింగ్లో భాగంగా వైజాగ్లో ఉండగా ఫ్యాన్స్ నడుమ వినాయకచవితి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని చరణ్ అన్నారు.