‘ఎవడు’ విడుదల తేదిని బహిర్గతం చేసిన రామ్ చరణ్

yevadu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. చివరికి నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు తెలియజేశాడు. అయితే ఈ సినిమాని మరోసారి కూడా వాయిదా వేసే అవకాశం ఉండదని సమాచారం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దానికి కారణం రామ్ చరణ్ ఈ మధ్య నిర్మాతలు ఈ సినిమా కోసం మరో కొత్త తేదిని వెతుకుతున్నారని చెప్పడమే. గత కొద్ది రోజులకు ముందు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన తిరుమలకు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా అతన్ని కలిసిన మీడియా వారితో రామ్ చరణ్ ఎవడు సినిమా గురించి మాట్లాడుతూ ” ‘ఎవడు’ సినిమాని డిసెంబర్ చివరి వారంలో గానీ లేదా సంక్రాంతి స్పెషల్ గా జనవరిలో గానీ విడుదల చేస్తాం’ అని అన్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ చరణ్ నటించనున్న సినిమాని కృష్ణ వంశీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు వెంకటేష్ కూడా హీరోగా నటించనున్నాడు.

Exit mobile version