మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేస్తున్న చరణ్ కొత్త, పాత సినిమాలు

Ramcharan
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుని మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేస్తుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన చికిరి చికిరి కేవలం తెలుగు వెర్షన్ లోనే 5 లక్షల 20 వేలకి పైగా షార్ట్స్ ని యూట్యూబ్ లో అందుకుంది.

కొత్త సినిమాకి ఇదంతా ఒకెత్తు అయితే రామ్ చరణ్ కల్ట్ క్లాసిక్ చిత్రం అది కూడా ఎప్పుడో పదిహేనేళ్ల కితం సినిమా పాటలు కూడా ఇప్పటికీ తెలుగు మ్యూజిక్ ఛార్ట్స్ ను రూల్ చేస్తున్నాయి. మరి ఆ చిత్రమే ‘ఆరెంజ్’. ఈ సినిమాలో పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మరి ఇందులో పాటలే ఇప్పుడు పాపులర్ మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో హైదరాబాద్ టాప్ సాంగ్స్ లో నేను నువ్వంటూ సాంగ్ టాప్ 6లో ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం. ఇలా రామ్ చరణ్ రెండు సినిమాలు ఒకటి పాతది ఒకటి కొత్తది తెలుగు మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేస్తున్నాయని చెప్పవచ్చు.

Exit mobile version