అదుర్స్-2 ఫైనల్ ముఖ్య అతిధి గా రాబోతున్న రామ్ చరణ్ తేజ

అదుర్స్-2 ఫైనల్ ముఖ్య అతిధి గా రాబోతున్న రామ్ చరణ్ తేజ

Published on Feb 29, 2012 10:55 AM IST

ఈ టీవీ లో వస్తున్న అల్టిమేట్ రియాలిటి షో “అదుర్స్-2” ఫైనల్ కి ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ విచ్చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతల్లో చరణ్ తేజ బాబాయ్ నాగబాబు గారు ఒకరు బుల్లి తెరలో ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలలో అదుర్స్ 2 ఒకటి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవాళ్ళు అబ్బుర పరిచే సాహసోపేతమయిన విన్యాసాలతో వారి ప్రతిభ ను నిరూపించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మల్లెమాల ఆర్ట్స్ నిర్మిస్తుంది గతం లో యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ మరియు ప్రభు దేవ “డీ” ఫైనల్స్ కి ముఖ్య అతిధులుగా వచ్చారు ఈ కార్యక్రమం కూడా మల్లెమాల ఆర్ట్స్ వారిదే.

తాజా వార్తలు