ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. అయితే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా రామ్ చరణ్ దీనికి ముందే కోలీవుడ్ దర్శకుడు శంకర్ తో వర్క్ చేసి ఊహించని ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది.
అయితే మన తెలుగు హీరోస్ కి తమిళ దర్శకులతో సక్సెస్ రేట్ చాలా తక్కువే ఉందని చెప్పాలి. ఇలాంటి సమయంలో కూడా రామ్ చరణ్ మరో తమిళ దర్శకునికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ దర్శకుడు ఏంటి ఎవరు అనేది ప్రస్తుతానికి బయటకి రాలేదు కానీ చర్చలు అయితే సాగుతున్నాయట. గత కొన్నాళ్ల నుంచి లోకేష్ కనగరాజ్ తో సినిమా అనే బజ్ ఉంది. మరి ఇది తప్ప మరో కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ ఆలోచనలో పడతారు అని చెప్పడంలో సందేహం లేదు.