బ్యాంకాక్లో ఫైట్స్ చేస్తున్న రామ్ చరణ్


ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో 1973లో విడుదలైన ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్ సెహేన్షా అమితాబ్ బచ్చన్ కి పవర్ఫుల్ యాక్షన్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ బాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ మీద పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్నారు. సౌత్ ఇండియన్ యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు.

Exit mobile version