కొద్ది రోజులు విరామం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎవడు” చిత్రీకరణలో రామ్ చరణ్ పాల్గొన్నారు. గత నెల ఈ చిత్రంలో కొంత భాగం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకున్న తరువాత రామ్ చరణ్ “నాయక్” చిత్రీకరణ కోసం యూరప్ వెళ్ళిపోయారు. గత వారం అయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈరోజు హైదరాబాద్ లో “ఎవడు” చిత్రీకరణ తిరిగి మొదలయ్యింది రామ్ చరణ్ మరియు ఏమి జాక్సన్ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ చిత్ర బృందం ఏమి మరియు చరణ్ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు వైజాగ్ వెళ్లనున్నారని సమాచారం ఈ చిత్రంలో సమంత మరో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ చిత్రీకరణలో అక్టోబర్ నుండి పాల్గొననుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ లు కూడా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది.