‘హిట్ 3’ సక్సెస్.. గ్లోబల్ స్టార్ విషెస్!

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా హిట్ ఫ్రాంచైజీ చిత్రాల్లో మూడో భాగంగా ఈ మూవీని రూపొందించాడు. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతూ సందడి చేస్తోంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ సాధించడంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా విషెస్ అందించాడు. హిట్ 3 మూవీపై పాజిటివ్ రివ్యూలు తనకు సంతోషాన్ని కలిగించాయని.. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దర్శకుడు శైలేష్ కొలను ఇలాంటి ఇంటెన్స్ కథను అందించిన తీరుకు హ్యాట్సాఫ్ అంటూ చరణ్ కామెంట్ చేశాడు.

ఇక ఈ సినిమాలో పని చేసిన శ్రీనిధి శెట్టి, నిర్మాత ప్రశాంతి తదితరులకు తన అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version