రామ్ చరణ్ నూతన చిత్రం ‘ఎవడు’ భారీ స్థాయిలో జూలై 31న విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ అతని పాత్రకు డబ్బింగ్ పూర్తిచేసుకున్నాడు. ఈ సినిమాకు సంభందించిన ప్రచారం కుడా మంచి జోరుగా సాగుతుంది. రామ్ చరణ్, అమీ జాక్సన్ ల నడుమ చిత్రీకరించిన ఒక టీజర్ ను కూడా ఈ రోజు విడుదలచేసారు . శృతిహాసన్ మెయిన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.