జనవరి 5 నుండి “రచ్చ” చిత్రీకరణ లో పాల్గొనబోతున్న రామ్ చరణ్

కొన్నాళ్ళ విరామం తరువాత రామ్ చరణ్ తిరిగి రచ్చ చిత్రీకరణ లో జనవరి 5 నుండి పోల్గోనబోతున్నారు. తమన్నా ఈ చిత్రం లో కథానాయికగా నటిస్తున్నారు ప్రస్తుతం తమన్నా “రెబెల్” చిత్ర షూటింగ్ కోసం బ్యాంకాక్ లో ఉన్నారు. బ్యాంకాక్ లో షూటింగ్ అయిపోయిన తరువాత తమన్నా “రచ్చ” చిత్ర బృందం లో చేరుతారు. “రచ్చ” తల కోన మరియు బాంబూ అడవులు, చైనా ల లో చిత్రీకరణ జరుపుకోనుంది. అజల్ అజ్మీర్ ప్రతి కథా నాయకుడి పాత్రలో చేస్తున్నారు సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఎన్వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు సంయుక్తంగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యాన్నర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ లో విడుదల కావచ్చు.

Exit mobile version