మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఎవడు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ‘మిర్చి’ఫేం కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ నెల చివరినుండి ఈ మూవీకి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే థమన్ చరణ్ నటించిన ‘నాయక్’ సినిమాకి మంచి బీటున్న సాంగ్స్ అందించాడు. మళ్ళీ వీరి కాంబినేషన్లో వస్తున్నా ఈ ఆల్బమ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.