ఆగష్టు చివరి వారం నుండి రామ్ – భాస్కర్ మూవీ కొత్త షెడ్యూల్

ఆగష్టు చివరి వారం నుండి రామ్ – భాస్కర్ మూవీ కొత్త షెడ్యూల్

Published on Aug 24, 2012 8:46 AM IST


సున్నితమైన కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మూడవ షెడ్యూల్ ఆగష్టు 26న మొదలుకానుంది. ఈ చిత్ర చిత్రీకరణ సమ్మర్ మొదట్లో గుంటూరులోని చిల్లీ మార్కెట్ లో మొదలై అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకోగానే హైదరాబాద్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర మూడవ షెడ్యూల్ తణుకులో ప్రారంభం కానుంది. ‘ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మరియు నా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మూడవ షెడ్యూల్ ఆగష్టు 26 నుండి తణుకులో ప్రారంభం కానుంది. ఇది చాలా పెద్ద షెడ్యూల్ అయినా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానని’ రామ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. శుభ ఫుతేల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఒంగోలు గిత్త’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

తాజా వార్తలు