యంగ్ హీరో నితిన్ కి ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి సూపర్‌హిట్ సినిమాలను అందించిన నిఖితా రెడ్డి నిర్మాతగా శ్రావన మూవీస్ బ్యానర్ పై చేయనున్న కొత్త సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది. సురేందర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఫేం రాకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసారు. రాకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో ఇదొక భారీ ఆఫర్ అనే చెప్పుకోవాలి.
అలాగే నితిన్ కి పోటీగా ఉండే విలన్ పాత్ర కోసం సోనూ సూద్ ని ఎంపిక చేసారు. నితిన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ లవ్ స్టొరీ తో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ మార్చి మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తుండగా హర్షవర్ధన్ డైలాగ్స్ అందిస్తున్నాడు.