కొచ్చడయాన్ ట్రైలర్ రెడీ అయిపోయిందోచ్

కొచ్చడయాన్ ట్రైలర్ రెడీ అయిపోయిందోచ్

Published on Feb 28, 2014 2:14 PM IST

kochadaiyaan-Poster

రజినికాంత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కొచ్చాడయాన్ తనదైన శైలిలో రూపుదిద్దుకుంటుంది. సౌందర్య రజినికాంత్ దర్శకురాలు. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సహా నిర్మాత

ఈ సినిమా ప్రచారం కోసం రూపొందించిన ట్రైలర్ ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకుంది. ట్రైలర్ ని చుసిన సౌందర్య చాలా ఆనందంగా వుంది. గత ఏడాది విడుదలైన టీజర్ అనూహ్య స్పందనను సొంతంచేసుకుంది. ఈ సినిమాను మోషన్ క్యాప్చుర్ పరిజ్ఞానంతో తీసినా రజిని మార్క్ మ్యానరిజంలతో తెరకెక్కించారు. ఈ ట్రైలర్ రికార్డులను తిరగరాస్తుంది అనడంలో సందేహంలేదు

ఈ సినిమా ఆడియో చెన్నైలో మార్చ్ 9న విడుదలకానుంది. హైదరాబాద్ లో మార్చ్ 10న తెలుగు వెర్షన్ ఆడియోకి కూడా ఈ సినిమా బృందమంతా హాజరుకానుంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. తెలుగులో విక్రమసింహా గా రానున్న ఈ సినిమాలో రజిని ద్విపాత్రాభినయం చేసారు. ఏప్రిల్ 11న సినిమాను మనముందుకు తీసుకురానున్నారు

తాజా వార్తలు