డిసెంబర్ 12 అంటే ప్రపంచమంతటా ఉన్న రజినీకాంత్ అభిమానులకి పండగ అనే చెప్పుకోవాలి. అయన నటించిన “శివాజీ” చిత్రాన్ని 3డి లో విడుదల చెయ్యనున్నారు తాజాగా మాకు అందిన మరో సమాచారం ప్రకారం అయన జీవితం మరియు కెరీర్ గురించి బయోగ్రఫీ ని కూడా రేపే విడుదల చెయ్యనున్నారు. ఫిలిం క్రిటిక్ మరియు జర్నలిస్ట్ అయిన నమన్ రామచంద్రన్ ఈ బయోగ్రఫీ రచించారు. దీనికి “రజినీకాంత్ ది డెఫినిటివ్ బయోగ్రఫీ” అని పేరు పెట్టారు.రేపటి నుండి ఈ పుస్తకం చెన్నైలో అందుబాటులో ఉంటుంది కే బాలచంద్ర దర్శకత్వంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన “అపూర్వ రాగంగల్” చిత్రం నుండి ఇప్పటి వరకు రజినీకాంత్ జీవితం మీద నమన్ రామచంద్ర రీసెర్చ్ నిర్వహించి ఈ పుస్తకాన్ని రచించారు. గతంలో గాయత్రీ రచించిన “ది నేమ్ ఇస్ రజినీకాంత్” మరియు పి సి బాలసుబ్రమణ్యం మరియు కృష్ణ మూర్తి రచించిన రజిని పంచతంత్ర అనే రెండు పుస్తకాలు రజినీకాంత్ గురించి వెలువడ్డాయి.