వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడి అయ్యిన “వేట్టయన్”

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మంజు వారియర్ హీరోయిన్ గా అలాగే మన టాలీవుడ్ వెర్సటైల్ నటుడు రానా దగ్గుబాటి విలన్ రోల్ లో దర్శకుడు టి జె జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రమే “వేట్టయన్”. మరి గత ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా మాత్రమే నిలిచింది. తెలుగులో కూడా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఆడిన ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా తెలుగు టెలివిజన్ వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమాని జెమినీ టీవీ వారు సొంతం చేసుకోగా ఈ ఫిబ్రవరి 16న సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ కి సిద్ధం అయ్యింది. మరి ఇటీవల తమిళ నాట టెలికాస్ట్ అయ్యిన ఈ సినిమా భారీ రెస్పాన్స్ ని అందుకుంది. మరి మన తెలుగులో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఫాహాద్ ఫాజిల్, రితిక సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version