టోక్యోలో జరగనున్న “శివాజీ(3డి)” ప్రీమియర్ షో లో రజనికాంత్ మరియు శ్రియ పాల్గొననున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదల అయ్యింది. ఈ చిత్రం అప్పట్లో భారీ విజయం సాదించింది. దాదాపుగా ఐదు సంవత్సరముల తరువాత ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఏవియం వారు ఈ చిత్రాన్ని 3డిలో మార్చి విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు. రజినికాంత్ కూడా ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తపరచారు. ఈ మధ్యనే ఈ చిత్ర విలేఖరుల కోసం చెన్నైలో ఒక షో వేశారు ప్రస్తుతం టోక్యో లో ఈ చిత్ర ప్రీమియర్ ను ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శ్రియ చిత్ర బృందంతో త్వరలో కలవనుంది. గత కొద్ది రోజులుగా ఆమె టొరంటొలో దీపా మెహత దర్శకత్వంలో వచ్చిన “మిడ్ నైట్ చిల్డ్రన్” చిత్ర ప్రిమియర్ ప్రదర్శన కోసం ఉన్నారు. శివాజీ 3డి చిత్రం టోక్యో లో సెప్టెంబర్ 15న ప్రదర్శితమవుతుంది.