‘కూలీ’ చిత్రాన్ని చూసి రజినీకాంత్ లోకేష్‌తో ఏమన్నాడంటే..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు లోకేష్ కగనరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఇటీవల ఈ చిత్ర డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు రజినీకాంత్.

ఇక ఈ సమయంలో ‘కూలీ’ సినిమాను చూసిన రజినీకాంత్ లోకేష్ కనగరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడట. ఈ సినిమాలో తనను చూసుకున్నాక నిజమైన థళపతి తనలో కనిపించాడని రజినీ అన్నాడట. ఈ విషయాన్ని లోకేష్ తాజాగా రివీల్ చేశాడు. ఇక ఈ కామెంట్‌తో రజినీ ఈ చిత్రంపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థమవుతుంది.

కూలీ చిత్రం రజినీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్, సౌభిన్ షాహిర్, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version