ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ అక్కడి స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ వల్ల పెద్ద బ్రేక్ నే తీసుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా హైదరాబాద్ షూట్ కు గాను వచ్చారు. కానీ ఊహించని విధంగా ఈరోజు వారి చిత్ర యూనిట్ కు కరోనా సెగ తగలడంతో ఈ సినిమా షూట్ ఆగిపోయినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.
అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం రజినీ అభిమానులకు కాస్త ఊపిరి పీల్చుకునే వార్తే వచ్చింది. రజినీ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చిందట. కానీ వారి చిత్ర యూనిట్ కు చెందిన 8 మందికి పాజిటివ్ రావడం బాధాకరం. దీనితో ఒక మంచి వార్త మరో చెడ్డ వార్త వచ్చినట్టు అయ్యింది. మరి వారికి ఏమి కాకూడదని ఈ వార్త విన్న నెటిజన్స్ కోరుకుంటున్నారు,అలాగే మనం కూడా కోరుకుందాం.