హిట్లర్ గా కనిపించనున్న రాజేంద్ర ప్రసాద్

Rajendra-Prasad-(4)

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ త్వరలోనే హిట్లర్ పాత్రలో కనిపించనున్నాడు. అలా అని విప్లవాత్మక భావాలతో హింసాయుతంగా ప్రవర్తించిన 20వ శతాబ్దపు హిట్లర్ గా కాదు 21వ శతాబ్దంలో నవ్వులు పూయించే హిట్లర్ గా కనిపించనున్నాడు. రాజేంద్ర ప్రసాద్ ఈ పాత్రని ‘టాప్ ర్యాంకర్’ అనే సినిమాలో చేస్తున్నాడు. గొల్లపాటి నారాయణరావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి పసుపులేటి బ్రహ్మం నిర్మాత.

రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ నేను ఈ సినిమాలో ప్రిన్సిపాల్ పాత్రలో కనిపించనున్నాను. మామూలుగా హిట్లర్ పాత్ర సీరియస్ గా ఉంటుంది . ఇందులో నా పాత్ర కూడా చాలా సీరియస్ గా ఉంటది కానీ అందరికి నవ్వు తెప్పించేలా ఉంటదని ‘ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చేనెలలో ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నామని తెలిపాడు.

Exit mobile version