నటుడు రాజీవ్ కనకాల ఇంట తీవ్ర విషాదం

నటుడు రాజీవ్ కనకాల ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి శ్రీలక్ష్మీ అకాల మరణం పొందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్ష్మీ కనకాల నేడు తుది శ్వాస విడిచారు. శ్రీలక్ష్మి భర్త పెద్ది రామారావు ప్రముఖ జర్నలిస్ట్ మరియు కథా రచయిత. ఈయన రంగస్థల అధ్యాపకులు కూడాను. వీరికి 2002లో వివాహం కాగా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

గత ఏడాది వీరి తండ్రిగారైన దర్శకుడు మరియు సీనియర్ నటులు దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించారు. కొద్ది నెలల వ్యవధిలోనే రాజీవ్ కనకాల ఇంటిలో రెండు దురదృష్ట సంఘటనలు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న చిత్ర ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

Exit mobile version