‘మిస్టర్ ఇండియా’గా రాబోతున్న రాజశేఖర్

‘మిస్టర్ ఇండియా’గా రాబోతున్న రాజశేఖర్

Published on Sep 12, 2012 6:55 PM IST


ఈ మధ్య పెద్దగా హిట్లు లేక సతమతమవుతున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగా 1987 లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా టైటిల్ ని వాడుకోవాలనుకుంటున్నాడు. గతంలో మీ శ్రేయోబిలాషి, మనోరమ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఈశ్వర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.

తాజా వార్తలు