ఇండియా మొత్తం మీద ముఖ్యంగా సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. రజినీకి ఒక్క ఇండియాలోనే కాదు సౌత్ ఈస్ట్ ఆసియాలో కూడా ఆయనకీ ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడు అంతా తలైవా అని పిలుచుకునే రజినీకాంత్ సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆదివారంతో 38 సంవత్సరాలు పూర్తయ్యింది. బెంగుళూరు లో ఒక సాధారణ కండక్టర్ గా ఉన్న రజినీలోని స్టైల్ ని గమనించిన డైరెక్టర్ కె. బాలచందర్ తను తీస్తున్న ‘అపూర్వ రాగంగల్’ సినిమాలో చాన్స్ ఇచ్చాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తున్న రజినీకాంత్ ఇప్పటివరకూ 170 సినిమాలు చేసాడు.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఎతో పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించిన చాలా సింపుల్ గా ఉండటం ఆయన గొప్పతనం అని చెప్పుకోవాలి. 62 ఏళ్ళ వయసులో కూడా ఆయనలోని స్టైల్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రజినీకాంత్ ‘కొచ్చాడియన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.