అయోమయంలో పడ్డ రాజమౌళి.!

అయోమయంలో పడ్డ రాజమౌళి.!

Published on Jul 8, 2012 9:30 PM IST


ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఈగ” విడుదలై అందరి నోటా మంచి టాక్ రావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రంగా ఖరారు చేశారు.ఈ చిత్రం విజయంతో రాజమౌళి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సినిమా హిట్ అయితే ఇబ్బందులేంటా అని ఆశ్చర్య పోతున్నారా? ఇప్పటివరకూ తీసిన అన్ని చిత్రాలు విజయవంతం కావడంతో ప్రేక్షకుల నాడీ తెలిసిన దర్శకుడిగా మరియు 100% హిట్ చిత్రాల దర్శకుడిగా రికార్డు సాదించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందరు పెద్ద నిర్మాతలు తమకో సినిమా చేయమని రాజమౌళిపై అవకాశాల వరద కురిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న దర్శకుడు.

‘ఈగ’ తర్వాత రాజమౌళి ఎవరితో చిత్రం చేయబోతున్నరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అందువల్ల ఏ హీరోతో సినిమా చేస్తాడా? అని ప్రతి ఒక్క హీరో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో లాభదాయకమైన ఆఫర్లు వస్తున్న తరుణంలో రాజమౌళికి ఏది తిరస్కరించాలో అర్ధంకాని అయోమయంలో పడ్డారు. ‘ఈగ’ లాంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత ఎలాంటి చిత్రం చేస్తారో? ఎవరితో చేస్తారో? అనే దాని కోసం రాజమౌళి గారే అధికారికంగా చెప్పే వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు