రాజమౌళి బాలివుడ్ ఆరంగేట్రం ఖరారు


బాలివుడ్లో రాజమౌళి ఆరంగేట్రం ఖరారు అయ్యింది. ఈ మధ్యనే విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న “ఈగ” హిందీలో అనువాదం కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 12న హిందీలో విడుదల కానుంది. ఈ విషయాన్నీ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన సుదీప్ తెలిపారు.ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో జూలై 6న విడుదల అయ్యి భారీ విజయం సాదించింది. అంతే కాకుండా రాజమౌళి కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా నిలిచింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మాతలు సాయి కొర్రపాటి మరియు సురేష్ బాబు హిందీలో అక్టోబర్ 12న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు.గతంలో ఈ చిత్రాన్ని అక్కడ 3డిలో విడుదల చెయ్యాలని అనుకున్నారు కాని తరువాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర అనువాద కార్యక్రమాలు చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటుంది. నాని,సమంత మరియు సుదీప్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

Exit mobile version