టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి వెకేషన్ నుంచి తిరిగి వచ్చారు. రాజమౌళి ప్రస్తుతం ప్రభాస్ తో తీయనున్న తన తదుపరి సినిమా కోసం ఒక వినూత్న కథ కోసం పని చేస్తున్నారు. యాక్షన్, ఎంటర్ టైనమెంట్ తో పాటు డ్రామా కలగలిసిన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంతో సినీ అభిమానులకు ఒక కొత్త రకమైన అనుభూతికి లోనయ్యేలా సినిమా తీయాలని ఈ చిత్ర నిర్మాతలు చూస్తున్నారని సమాచారం.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా బానర్ వారు నిర్మిస్తున్నారు. గతంలో ప్రభాస్ మరియు రాజమౌళి కలిసి చేసిన ‘చత్రపతి’ సూపర్ హిట్ గా నిలిచింది. మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెల్లనుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ ఇటీవలే విడుదలై ఘన విజయాన్ని సాదించింది. మళ్ళీ ఈ సారి ఎలాంటి కొత్త రకమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడో అనే దానికోసం ఇంకొంత కాలం వేచి చూడాలి.