“RRR” అప్పటికి కంప్లీట్ అయ్యిపోతుందా..?

బాహుబలి లాంటి బిగ్గెస్ట్ ఎపిక్ డ్రామా అనంతరం తెలుగు సినిమా బాక్సాఫీస్ దెబ్బ రుచి ఇండియన్ సినిమాకు చూపించేందుకు రెడీగా ఉన్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబోలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అంతే స్థాయి అంచనాలతో రూపు దిద్దుకొంటుంది.

అయితే కరోనా పరిస్థితులు కానీ లేకపోతే ఎప్పుడో షూటింగ్ పూర్తయిపోవాల్సిన ఈ చిత్రం ఇటీవలే మళ్ళీ పునః ప్రారంభం అయ్యింది. ఇక ఇదిలా ఉంటే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని జక్కన ఎప్పటికి ఫినిష్ చేసెయ్యాలి ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇంకా కొంత భాగాన్ని మిగుల్చుకొని రాత్రి పగలు తేడా లేకుండా షూట్ ను జరుపుకుంటుంది. ఇలా రాజమౌళి వచ్చే జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి నాటికి పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Exit mobile version