సినిమాలో నటించే అవకాశం ఇస్తున్న రాజమౌళి

సినిమాలో నటించే అవకాశం ఇస్తున్న రాజమౌళి

Published on Jan 7, 2013 7:04 PM IST

rajamouliఅగ్ర దర్శకుడు నెక్స్ట్ సినిమా ప్రారంభం కాకముందే అలజడి మొదలైంది. ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది అన్న వార్త సంచలనం సృష్టిస్తే, తరువాత ఆ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో రానా కనిపిస్తాడు అన్న వార్త కూడా అంతే సంచలనం సృష్టించింది. ఇన్ని సంచలనాలకు కేంద్ర బిందువైన ఈ సినిమాలో నటించేందుకు నూతన నటీ నటులకు అవకాశం కల్పిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలోని కొన్ని పాత్రలకి కొత్త మొహాలైతేనే సెట్ అవుతారని అనిపించి కొత్త వారిని తీసుకోవడం కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసారు. నటన మీద ఆసక్తి ఉండి 20 నుండి 60 సంవత్సరాల వారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోలు, వీడియోలని [email protected] మెయిల్ కి మెయిల్ చేయండి.

తాజా వార్తలు