గోవాకి పయనమైన రాజమౌళి

గోవాకి పయనమైన రాజమౌళి

Published on Aug 15, 2012 3:53 AM IST


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ గోవా వెళ్తున్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రారభించిన ‘ఈగ’ చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేసిన రాజమౌళి ఆ తర్వాత ఆ చిత్ర ప్రమోషన్స్ విషయంలో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ‘అందాల రాక్షసి’ చిత్రానికి సహా నిర్మాత కావడం వల్ల కొద్ది రోజులు ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు చివరికి ఆ చిత్రం కూడా విడుదలై మంచి స్పందనతో నడుస్తుండడంతో రాజమౌళి ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘ సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ గోవా వెళుతున్నాను. అందువల్ల ఒక వారం రోజులు ట్విట్టర్లో కనపడను… వెల్లోస్తాను’ అని రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. హాలిడే నుంచి వచ్చాక తను ప్రభాస్ తో చేయనున్న చిత్రం యొక్క పనులను ప్రారంభిస్తారు.

తాజా వార్తలు