సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబును ఇప్పటివరకు చూపెట్టని విధంగా రాజమౌళి మనకు చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాలో మహేష్‌లోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకొచ్చేందుకు రాజమౌళి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ ఉండనుందని.. దీనికి కీరవాణి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనుండగా రాజు సుందరం కొరియోగ్రఫీ చేయనున్నాడట. ఇక ఈ పాటలో హీరోయిన్ ప్రియాంక చోప్రాతో మహేష్ సరికొత్త స్టెప్స్‌తో డ్యాన్స్ చేయనున్నట్లు చిత్ర వర్గాల టాక్.
ఈ పాటలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా డ్యాన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను నవంబర్‌లో వెల్లడించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.