SSMB29: RRR కి మించి వీటికి అత్యంత ప్రాధాన్యత.. వరల్డ్ షేక్ అయ్యేలా

SSMB29: RRR కి మించి వీటికి అత్యంత ప్రాధాన్యత.. వరల్డ్ షేక్ అయ్యేలా

Published on Jun 24, 2025 9:00 AM IST

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఇండియన్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ స్టాండర్డ్స్ ని మార్చిన దర్శకుల్లో ఇప్పుడు ప్రధానంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు తప్పకుండా ఉంటుంది.

ఇక తాను తెరకెక్కించిన RRR సినిమా అయితే మన ఇండియన్ సినిమా దగ్గర ఒక కొత్త విజువల్ ట్రీట్ ని అందించింది. ఈ సినిమాలో అత్యంత సహజంగా కనిపించే గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇక ఇదే అనుకుంటే దీనికి మించిన ట్రీట్ మహేష్ తో తీస్తున్న సినిమాకి రాజమౌళి ప్లాన్ చేశారట. ఈసారి దెబ్బకి వరల్డ్ వైడ్ సినిమా దగ్గర తమ సినిమా కోసం మరోమారు మాట్లాడుకునే రేంజ్ లో అవుట్ పుట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా విజువల్స్ ఉంటాయని ఎవరూ ఊహించని రేంజ్ లో కనిపిస్తాయని ఇపుడు టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు