బాహుబలిపై పుకార్లను ఖండించిన రాజమౌళి

బాహుబలిపై పుకార్లను ఖండించిన రాజమౌళి

Published on Dec 27, 2013 10:15 PM IST

Bahubali
ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వెండితెర వండర్ బాహుబలి ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఎప్పట్నుంచో వార్తల్లో నిలుస్తున్న వార్ ఎపిసోడ్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ షూటింగ్ కు కొంతమంది గ్రామస్థుల వలన ఆగిపోయిందని, షూటింగ్ కు అనుమతి లేకపోవడమే దానికి కారణమని పుకార్లు వచ్చాయి. అయితే ఇటువంటి పుకార్లను రాజమౌళి తోసిపుచ్చాడు

ఈ పుకార్లను ఖండిస్తూ రాజమౌళి ట్విట్టర్ లో “షూటింగ్ ను కొంతమంది గ్రామస్తులు అడ్డుకున్నారు అనే వార్త విన్నాను. నిజానికే ఇది నాకే కొత్త వార్త.. 🙂 బాహుబలి సినిమా షూటింగ్ ఏ ఆటంకాలు లేకుండా సాగుతుంది”. ఈవారం మొదలైన షెడ్యూల్ మరో రెండునెలల పాటూ సాగనుంది. ప్రధానతారాగణంతో పాటూ 2000మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ షూటింగ్ లో పాల్గుంటున్నారు

ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి ప్రధానపాత్రధారులు. రమ్యకృష్ణ, సత్యరాజ్ మరియు నాజర్ ముఖ్యపాత్రధారులు. శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని ఈ సినిమాను ఆర్కమీడియావర్క్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతదర్శకుడు

తాజా వార్తలు