మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మూడు మొక్కలు నాటారు. రెబల్ స్టార్ ప్రభాస్ నుండి ఈ ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్, మరో ఇద్దరిని నామినేట్ చేశాడు. దర్శక ధీరుడు రాజమోళి మరియు హీరోయిన్ అలియా భట్ ని నామినేట్ చేయడం జరిగింది. కాగా తాజాగా చరణ్ ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి, ఈ రోజు తన బృందంతో పాటు మొక్కలను నాటారు. కెమెరామెన్ సెంథిల్ కూడా మెక్కలను నాటారు. అనంతరం రాజమౌళి తన తోటి దర్శకులు వినాయక్, పూరికి మరియు ఆర్.జి.వి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.
ఈ కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం కలిపిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జె నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంకా కొనసాగడం గొప్ప పరిణామం. ఇక రామ్ చరణ్ విసిరిన ఛాలెంజ్ కి అలియా భట్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తనను రామ్ చరణ్ నామినేట్ చేసినందుకు అలియా సంతోషం వ్యక్తం చేస్తూ… ఐతే లాక్ డౌన్ సమయంలో అలియా తన గార్డెన్ లో అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు. కానీ నేను మరలా మూడు మొక్కలు నాటే ముందే, ఓ ముగ్గురిని నామినేట్ చేస్తానని, అలియా భట్…శ్రద్దా కపూర్, దియా మీర్జా, భూమి పెడ్నేకర్ లను నామినేట్ చేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ రామ రాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ లవర్ సీత పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.