పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హార్రర్ కామెడీ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరిచేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వారిని సంతోష పరిచేందుకు ఇప్పుడు రాజా సాబ్ రెడీ అవుతున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అనౌన్స్‌మెంట్‌ను జూన్ 3న ఉదయం 10.34 గంటలకు చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు. ఈ టీజర్ అనౌన్స్మెంట్ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ చేయబోయే రచ్చ మామూలుగా ఉండదని వారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్‌ను జూన్ 15న రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ టాక్.
మరి నిజంగానే ఈ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు