టాలీవుడ్ లో భారీ ప్లాన్స్ చేసుకుంటున్న రాజ్ – డికె

టాలీవుడ్ లో భారీ ప్లాన్స్ చేసుకుంటున్న రాజ్ – డికె

Published on Dec 29, 2013 5:30 PM IST

Krishna_D.K._&_Raj_Nidimoru
జంట దర్శకులైన రాజ్ – డికె కలిసి నిర్మించిన సినిమా ‘డీ ఫర్ దోపిడీ’. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ టాలీవుడ్ లో భారీగానే ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ కి వీళ్ళు తక్కువగానే తెలిసినప్పటికీ షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ సినిమాలతో తెలుగువారికి బాగానే పరిచయం ఉన్నారు. అలాగే వాళ్ళ స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ యూత్, ఏ సెంటర్స్ వారిని బాగా ఆకట్టుకుంటోంది.

వీళ్ళిద్దరూ తడుమరిగా మహేష్ బాబుని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన వివరాల విషయం ఇంకా క్లియర్ కాలేదు. కానీ రాజ్ – డికె మాత్రం మా స్టైల్లో ఉండే టిపికల్ మహేష్ బాబు సినిమా అవుతుందని అంటున్నారు. ఈ సినిమా 2014 మధ్యలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇటీవలే రాజ్ – డికె తో కలిసి నాని డీ ఫర్ దోపిడీ సినిమాని నిర్మించాడు. అన్నీ కుదిరితే నాని కూడా వీరి డైరెక్షన్లో ఓ సినిమా చేసే అవకాశం ఉంది.

ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తారో చూడాలి. ప్రస్తుతానికి రాజ్ -డికె సైఫ్ అలీ ఖాన్, ఇలియానా హీరో హీరోయిన్స్ గా హ్యాపీ ఎండింగ్ సినిమా చేస్తున్నారు. అది 2014 సమ్మర్లో రిలీజ్ అవుతుంది.

తాజా వార్తలు