విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : రోహిణి మొల్లేటి, వేద రెడ్డి, మోహిత్ తదితరులు
దర్శకుడు : తేజ
నిర్మాత : కే రాఘవేంద్ర రావు బి ఏ
సంగీత దర్శకుడు : సాయి మధుకర్
సినిమాటోగ్రాఫర్ : శేఖర్ గంగనమోని
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న కథా సుధ నుంచి ఈ వారం వచ్చిన సరికొత్త లఘు చిత్రమే “నమ్మకం”. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో నటి రోహిణి నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఓ కాలేజీ కుర్రాడు వంశీ కృష్ణ (మోహిత్ పెడద) అల్లరి చిల్లరగా ఫ్రెండ్స్ తో కాలేజ్ లైఫ్ ని పెద్దగా కేర్ తీసుకోకుండా గడిపేస్తుంటాడు. ఇలా తన కాలేజ్ అమ్మాయి
శైలజ (వేద) తో గొడవగా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకోవాలని చూస్తాడు. కానీ వంశీ తల్లి లక్ష్మి (రోహిణి) తన కొడుకే పంచ ప్రాణాలుగా బాగా చదువుకుంటున్నాడని అందరికీ ఎంతో గొప్పగా ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఉన్న వంశీకి ఎలా కనువిప్పు కలిగింది? ఆ తర్వాత తాను ఏం చేసాడు? ఇన్నాళ్లు అబద్దం బ్రతుకులో ఉన్న వంశీ కృష్ణ తన తల్లి కోసం ఏం చేసాడు అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో మెయిన్ గా ఆకట్టుకునే అంశం ఏదన్నా ఉంది అంటే మంచి ఎమోషనల్ పార్ట్ అని చెప్పాలి. సరిగ్గా అరగంట కూడా లేని ఈ ఎపిసోడ్ లో ఆకట్టుకునే ఎమోషన్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు కథా సుధలో కొంచెం తండ్రి, కూతుర్ల కంటెంట్ రిపీట్ అయ్యింది కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం స్వచ్ఛమైన తల్లి, కొడుకుల నడుమ భావోద్వేగాలు చూపించడం జరిగింది.
అవి కూడా బాగా వర్క్ అయ్యాయి. అయితే ఇందుకు ముఖ్య కారణం మాత్రం నటి రోహిణి అని చెప్పవచ్చు. ఆమె తన రోల్ లో జీవించారు. కొడుకు పట్ల ఎంతో నమ్మకం, ప్రేమ పెట్టుకున్న అమాయక తల్లిగా ఎంతో బాగా నటించారు. తన కొడుకు విషయంలో చెప్పే కొన్ని మాటలు మరింత ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఇక తనతో పాటుగా తన కొడుకుగా కనిపించిన మోహిత్ బాగా చేసాడు.
తన లుక్స్ కానీ తన తల్లి విషయంలో రియలైజ్ అయ్యిన తర్వాత చేసిన ఎమోషనల్ పెర్ఫామెన్స్ బాగుంది. ఇక ఫీమేల్ లీడ్ లో నటించిన అమ్మాయి వేద కూడా తన రోల్ లో బాగా ఫిట్ అయ్యి చేసింది. ఇక స్టార్టింగ్ లో రాఘవేంద్ర రావు మార్క్ మూమెంట్స్ కూడా కనిపిస్తాయి. దీనితో మేకర్స్ ఇందులో చెప్పాలనుకున్న సందేశం వర్క్ అయ్యింది.
మైనస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో ఎమోషనల్ పార్ట్ బాగుంది కానీ మిగతా అంశాలు మాత్రం రొటీన్ అండ్ రెగ్యులర్ గానే ఉన్నాయి. కాలేజ్ సీన్స్, లవ్ ట్రాక్ లాంటివి పైగా అందులో సాంగ్ అందరికీ ఇంపుగా అనిపించకపోవచ్చు.
అలాగే వీటిలో కొన్ని సన్నివేశాలు తగ్గించి రోహిణి, తన కొడుకు ట్రాక్ లో మరిన్ని బ్యూటిఫుల్ సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుండేది. ఇవి కొంచెం ఇందులో మైనస్ అనిపిస్తాయి. అలాగే యువ జంట ట్రాక్ లో సంగీతం కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. టెక్నికల్ టీంలో సాయి మధుకర్ సంగీతం మొదట్లో బిలో యావరేజ్ గానే ఉంది కానీ తర్వాత పర్వాలేదు అనిపిస్తుంది. గంగనమోని శేఖర్ ఇచ్చిన ఛాయాగ్రహణం బాగుంది. రాఘవేంద్ర వర్మ ఎడిటింగ్ బానే ఉంది. ఇక సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు ఎమోషనల్ పార్ట్ వరకు మాత్రం తన మార్క్ చూపించారు. అలాగే స్క్రీన్ ప్లే కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక దర్శకుడు తేజ కూడా డీసెంట్ వర్క్ ని అందించారు అని చెప్పవచ్చు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ‘నమ్మకం’ అనే లఘు చిత్రం ఈటీవీ విన్ కథా సుధ నుంచి మరో డీసెంట్ ఎపిసోడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ తల్లి, కొడుకుల మధ్య ఎమోషనల్ బంధాన్ని బలంగా ప్రతిబింబిస్తుంది. ఈ క్రమంలో మేకర్స్ చెప్పదల్చుకున్న సందేశం కూడా బాగుంది. కాకపోతే మిగతా మూమెంట్స్ మాత్రం కొంచెం రొటీన్ అండ్ రెగ్యులర్ గానే ఉంటాయి. జస్ట్ వీటిని పక్కన పెడితే మాత్రం రోహిణి, మోహిత్ ల ఎమోషనల్ పెర్ఫామెన్స్ లు తమ ఎమోషనల్ ట్రాక్ లు ఆకట్టుకుంటాయి. సో ఈ చిత్రాన్ని చూడొచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team