ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : నవంబర్ 23, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : సన్యు, ప్రియాంక, మంజు శ్రీ, ఆదిత్య
దర్శకుడు : సుధీర్ కుమార్
నిర్మాణం : రాఘవేంద్ర రావు బి. ఏ
సంగీతం : సాయి మధుకర్
ఛాయాగ్రహణం : రాఘవేంద్ర వట్టెల
కూర్పు : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రతీవారం లానే ఈసారి వారం కూడా తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ కథా సుధ వీక్లీ సిరీస్ లో వస్తున్న కొత్త ఎపిసోడ్స్ లో భాగంగా వచ్చిన ఈ వారం చిత్రమే “ఏఐ లవ్ స్టోరీ”. దిగ్గజ దర్శకుడు కే రాఘవేంద్రరావు కథ అందించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే యువకుడు ఆనంద్ (సన్యు), ఆల్రెడీ ఒకమ్మాయి ఐశ్వర్య (ప్రియాంక) ని ప్రేమించి ఇద్దరూ పెళ్లి కూడా చూసుకోవాలని డిసైడ్ అవుతారు. కానీ అదే కంపెనీలో పని చేసే మరో అమ్మాయి ప్రియ (మంజు శ్రీ) కూడా ఆనంద్ ని ప్రేమిస్తుంది. ఎప్పుడూ ఆప్షనల్ గా వేరే ఆప్షన్ ని పెట్టుకునే తాను ఎలాగైనా ఆనంద్ ని తన వశం చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ని వాడి ఇద్దరినీ విడదీయాలని చూస్తుంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? ఆ ఇద్దరు ప్రేమికులు విడిపోతారా? చివరికి ఎవరు ఎవరితో కలిసి ఉంటారు? ఈ ఏఐ వల్ల నష్టం జరిగిందా మంచి జరిగిందా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు రాఘవేంద్రరావు ట్రెండీ లైన్ ని ఎంచుకొని అందులో ఒక డీసెంట్ సందేశాన్ని అందించే ప్రయత్నం ఈ చిత్రంలో మెప్పిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI – కృత్రిమ మేధస్సు) వ్యాప్తి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఏది నిజం ఏది అబద్దం అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.
దానిని ఎలాంటి పనులకు వాడితే మంచిది ఎలాంటివి చేయకూడదు అనే పాయింట్ ఇందులో డీసెంట్ గా ఉంది. దీనికి అనుగుణంగా తీసుకున్న ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు అంతా తమ పాత్రలకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. యంగ్ నటుడు సన్యు మంచి హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తూ ఆనంద్ గా మంచి నటన కనబరిచాడు.
అలాగే ప్రియాంక కూడా తన రోల్ లో బాగా చేసింది. ఇక వీరితో పాటుగా మంజుశ్రీ కూడా బాగా చేసింది. తన ట్రాక్ ఇందులో బాగుంది. మొదటి 15 నిమిషాల కంటే నెక్స్ట్ 15 నిమిషాల నుంచి కథనం మరికొంత ఇంప్రెసివ్ గా సాగింది. ఇక వీటితో పాటుగా ప్రియాంక తండ్రిగా చేసిన నటుడు మంచి హావభావాలు పలికించారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ఒకింత ట్రెండీ అటెంప్ట్ ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ మాత్రం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. అలాగే చిన్నపాటి సాంగ్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. అలానే ప్రియాంక రోల్ ఇంకొంచెం బెటర్ గా డెవలప్ చేయాల్సింది.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత ప్రేమించిన అమ్మాయి అయినా తాను చూసింది నిజమా కాదా అనేది మినిమమ్ కూడా ఆలోచించలేదు అంటే అది లాజికల్ గా అనిపించదు. అలాగే ఆనంద్, ఐశ్వర్యల లవ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నీట్ సెటప్, సంగీతం, కెమెరా వర్క్ డిపార్ట్మెంట్ పనులు బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉంది. ఇక దర్శకుడు సుధీర్ కుమార్ డీసెంట్ వర్క్ ఈ లఘు చిత్రానికి అందించారు. రాఘవేంద్రరావు ఇచ్చిన కథ, కథనాలకి తన నుంచి క్లీన్ అవుట్ పుట్ ఇచ్చే విధంగా టేక్ తీసుకున్నారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘ఏ ఐ లవ్ స్టోరీ’ లఘు చిత్రం ఈ కథా సుధలో ఇది వరకు వచ్చిన ఇతర సినిమాలతో పోలిస్తే కొంచెం ట్రెండీ టచ్ అనిక్ చెప్పవచ్చు. కొన్ని మూమెంట్స్ రొటీన్ అనిపించవచ్చు కానీ ఇందులో ఇచ్చిన మెసేజ్ డీసెంట్ గా ఉంది. సో ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ లో ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


